![]() |
![]() |
.webp)
విజయ్ దేవరకొండ పేరుకు స్టార్ మాత్రమే కాదు మనసున్న మంచి మనిషి అనిపించుకున్నాడు. రీసెంట్ గా ప్రసారమైన ఇండియన్ ఐడల్ సీజన్3 షోకి గెస్ట్ గా వచ్చాడు రౌడీ బాయ్. ఇదే టైములో విడికి ధన్యవాదాలు చెప్పడానికి కొంతమంది స్టేజి మీదకు వచ్చారు. స్నేహ అనే ఒక ట్రాన్స్ జెండర్ విజయ్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. “నేనొక ట్రాన్స్ జెండర్ ని సార్. రెండేళ్లు మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నాను.
మాకు బెగ్గింగే జీవనాధారం. లాక్ డౌన్ టైంలో అందరం ఇంటికే పరిమితం అయ్యాం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాను. ఒకరోజు గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉండగా విజయ్ ఫౌండేషన్ అని కనిపించింది. దానిపై క్లిక్ చేసి హెల్ప్ చేయాలంటూ ఫామ్ ను ఫిల్ చేశాను. అంతే కేవలం 16 నిమిషాల్లోనే నాకు ఫౌండేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నాకే కాదు.. ఇలా 18 మంది ట్రాన్స్ జెండర్స్ కు మీరు సాయం చేశారు. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు” అంటూ ట్రాన్స్ జెండర్ స్నేహ కన్నీరు పెట్టుకుంది. అలాగే మరో కుర్రాడు ఫామిలీ కొడాఆ వచ్చి విజయ్ చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. దానికి విజయ్ స్పందించారు. “ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది రూ. 500, రూ. 1000 రూపాయాలు సాయం చేశారు. వేరే వేరే చోట్ల నుంచి కూడా ఎంతో మంది సాయం చేశారు. ఇంతమంచి మనుషుల మధ్య ఉంటున్నందుకు నిజంగా గర్వపడాలి" అని చెప్పారు. అలాగే 100 మంది పేద అభిమానుల కుటుంబాలకు కరోనా టైములో తలా ఒక లక్షచొప్పున సాయం చేశాడు విజయ్. ఇలా విజయ్ చేసిన సాయం ఏంటి అన్న విషయం ఈ షో ద్వారా అందరికీ తెలిసింది.
![]() |
![]() |